సుజాత ఆర్టిస్ట్ కాకపోయి ఉంటే పాత సామాన్లు అమ్ముకునేది
on Jul 22, 2025
సుమ అడ్డా షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి బుల్లితెర నటులు వచ్చారు. రాకింగ్ రాకేష్ - జోర్దార్ సుజాత, కీర్తి భట్ - విజయ్ కార్తీక్, నీలిమ - శేఖర్ వచ్చారు. ఇక సుమ వీళ్ళను బాగా ఆట పట్టించింది. సుమ ప్లేట్ లో చిలకలు చుట్టి రాకేష్ కి ఇచ్చి పెట్టమని చెప్పింది. "ఏంటి ఈవిడ గిలకలా ఉంది చిలకలు పెట్టాలా" అంటూ ఫన్నీ కౌంటర్ వేసాడు రాకేష్. ఇక ఈ ప్రోమో లాస్ట్ లో రాపిడ్ ఫైర్ ఆడించింది. "సుజాత ఆర్టిస్ట్ కాకపోయి ఉంటే ఏ వృత్తి ఎంచుకునేది...పాత సామాన్లు అమ్ముకోవడం " అని అడిగింది సుమ. దాంతో సుజాత ఒక ప్లాస్టిక్ బిందెను నడుము మీద పెట్టుకుని "పాత ఇనప సామాన్లు కొంటాం.. చిరిగిపోయిన పుస్తకాలు కొంటాం. అరిగిపోయిన రికార్డులు కొంటాం..రావాలి బాబు రావాలి" అంటూ అరిచి మరీ చూపించింది.
"మీ హజ్బెండ్ లేనప్పుడు ఆయన ఫోన్ లో మీరు ఎం చెక్ చేస్తారు" అంటూ నీలిమను అడిగింది సుమ. "వాట్సాప్ చాట్స్ చూస్తాను" అని చెప్పింది. "వీళ్ళిద్దరిలో వాళ్ళ భార్యలకు భయపడతారని అనుకుంటున్నారు..రాకేషా, శేఖరా" అని అడిగింది సుమ. "కచ్చితంగా రాకేష్" అంటూ కీర్తి భట్ ఫన్నీగ చెప్పింది. తరవాత అందరూ కలిసి కీర్తి బర్త్ డేని సెలెబ్రేట్ చేశారు. కీర్తి కేక్ చేసి అందరికీ తినిపించింది. కీర్తి భట్ రేగులర్గా ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోకి వస్తూ ఉంటుంది. అలాగే సుజాత - రాకేష్ కలిసి జబర్దస్త్ స్కిట్స్ చేస్తూ ఉంటారు..ప్రతీ షోలో వీళ్ళు జోడీగా కనిపిస్తూనే ఉంటారు. అలాగే రీసెంట్ గా ఇష్మార్ట్ జోడి రియాలిటీ షోకి కూడా వెళ్లి వచ్చారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
